అట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి భజన పోటీలు..

అట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి భజన పోటీలు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ లో జిల్లా స్థాయి హరినామ సంకీర్తన భజన పోటీలు ఆదివారంధర్మ జాగరణ రాష్ట్ర నిధి ప్రముఖ్ ఏడుదొడ్ల శ్రీనివాస్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. నిర్వాహకులు సుధాకర్ రెడ్డి, దోరోళ్ల కృష్ణయ్య, దాసరి రామాంజనేయులు ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భజన వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని, వ్యక్తి సన్మార్గంలో ప్రయాణించుటకు తోడ్పడుతుందని అన్నారు. భజన పరులు హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసం పని చేయాలని కోరారు. ప్రతి హిందువు ఇంట్లో రామాయణం, భారతం, భగవద్గీత పవిత్ర గ్రంథాలు ఉండాలని, వాటిని ఇంట్లో అందరూ చదవడం వలన ఇల్లు, ఊరు, దేశ శ్రేయస్సు కోసం పని చేసే పౌరులు తయారు అవుతారని అన్నారు.
ఈ భజన పోటీలు ఈ నెల 26 వరకు జరుగుతాయని తెలిపారు. ఇప్పటి వరకు 40 టీంలు నమోదు చేసుకున్నట్లు వివరించారు. ఆసక్తి కల భజన టీంలకు చివరి రోజు వరకు పేరు నమోదు చేసుకొని పాల్గొనవచ్చని అన్నారు. గెలుపొందిన టీం లకు శ్రీరామ నవమి రోజు శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవాలయం లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్త, పంచమ నగదు బహుమతులు అందచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, వార్దు సభ్యులు నేడుగం రాఘవేంద్ర, చెన్నా రెడ్డి,గ్రామ పెద్దలు చాకలి వెంకటప్ప , వెంకప్ప గౌడ్, ఉప్పు ఆంజనేయులు, దాసరి రాజమూరి, దోరోళ్ల రాము, నాగిరెడ్డి, నర్సింహా రెడ్డి, మాదారం రాములు తదితరులు పాల్గొన్నారు.
