బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలి..

బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలి..
రైతులకు బస్సు షెల్టర్ లేక నానా కష్టాలు
స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ అధికారులు స్పందించాలి
తక్షణమే బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని అన్నదాతల విజ్ఞప్తి
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ ప్రాంతానికి స్టేషన్ ఘన్ పూర్, జఫర్ గడ్, చిలుపూర్, పాలకుర్తి తదితర ప్రాంతాలనుంచి రోజూ వంద లాది మంది రైతులు, కూలీలు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తున్నా రు. పంటలను అమ్మడానికి ఉదయం వేళల్లోనే మార్కెట్‌కు చేరుకునే రైతన్నలు సాయంత్రం వరకు కష్టపడి పని చేసి తిరుగు తమ గ్రామాలకు వెళ్లే సమయంలో బస్సుల కోసం రోడ్డుపై నిలబడి వేచి చూడాల్సిన పరి స్థితి నెలకొంది.
ఎండలోనూ…వానలోనూ రోడ్డుపైనే నిరీక్షణ:
మార్కెట్ ప్రాంతంలో శాశ్వత బస్సు షెల్టర్ లేకపోవడంతో ఎండ, వాన, గాలివానల సమయంలో మహిళా రైతులు, వృద్ధులు, కూలీలు, సరు కులతో వచ్చే చిన్న వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది అని ప్రతి వేదికపై పలుకుతున్నాం. అదే రైతు బస్సు కోసం రోడ్డుపక్కన నిలబడే పరిస్థితి మారకపోతే ఆ నినాదానికి అర్థమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రమాదాలకు ఆస్కారం:
మార్కెట్ వద్ద స్థానికుల అభిప్రాయం ప్రకారం బస్సు షెల్టర్ ఏర్పాటు చేస్తే బస్సులు అధికారికంగా అక్కడ ఆగే అవకాశం ఉంటుంది. ప్రస్తు తం షెల్టర్ లేకపోవడంతో కొన్ని బస్సులు సరిగా ఆగకపోవడం, రోడ్డు మధ్యలో ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రమాదాలకు కూడా ఆస్కారం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విజ్ఞప్తులు ఫలించలేదా?
వ్యవసాయ మార్కెట్ వంటి కీలక ప్రాంతంలో శాశ్వత బస్సు షెల్టర్ లేకపోవడం విచారకరమని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. . ఇప్ప టికే పలుమార్లు సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ అధికారులు, సంబంధిత శాఖలు మానవతా దృష్టితో స్పందిం చాలి. రైతు ప్రయాణ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. మార్కెట్ వద్ద బస్సులు తప్పని సరిగా ఆగే విధంగా శాశ్వత బస్సు షెల్టర్ నిర్మా ణానికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
