TG | ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలి – నిరంజన్ రెడ్డి

TG | ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలి – నిరంజన్ రెడ్డి

TG | వనపర్తి టౌన్, ఆంధ్ర ప్రభ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 23వ వార్డు బూత్ నం.1లో నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియతో పాటు కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఫలితాలను తారుమారు చేసిన సంఘటనలు సోలీపూర్ గ్రామంలో జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల అభీష్టం ప్రలోభాలకు అతీతంగా, నిర్భయంగా, మనిష్పాక్షికంగా వెల్లడి కావాలన్నదే ఎన్నికల నియమావళి ఉద్దేశమని, అది నెరవేరాలని కోరారు.

Leave a Reply