TG | అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారం…

TG | అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారం…
TG | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : తన భర్తకు విజయం అందించాలని కోరుతూ శెవ్వ సుజాత ఆదివారం ఒకటో వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తన భర్త శెవ్వ అశోక్ కౌన్సిలర్ గా పోటీలో ఉన్నట్టు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో వార్డులోని అన్ని కాలనీల్లో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. స్థానికుడిగా వార్డు ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తిగా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే తన భర్త ను గెలిపించాలని కోరారు. కాలనీ లో ఎన్నో రోజులుగా ప్రజలను ఇబ్బంది చేస్తున్న లో వోల్టెజ్ సమస్య పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్బంగా ఆడబిడ్డ లకు బొట్టు పెడుతూ ఇంటి ఆడబిడ్డ గా తన భర్త ను గెలిపించాలని కోరారు. ఆమె వెంట మహిళలు ఉన్నారు.
