రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలి
రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలి
దండేపల్లి, ఆంధ్రప్రభ: రైతులు పండించినయాసంగి వడ్లు,మొక్కజొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని సోమవారం దండేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి దండేపల్లి మండల కేంద్రంలో ని పద్మశాలి భవనం ముందు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యానికి కొనుగోలు కేంద్రాల నిర్వహకులు బస్తాకు మూడు కిలోలు కటింగ్ చేయడం సరికాదని అన్నారు. బస్తాలు కాంట అయిన తర్వాత బస్తాలను తరలించడానికి బ్యాగుకు రెండు రూపాయల చొప్పున ఇవ్వాలని లారీ వారు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు నిర్వహకులు మొక్కజొన్న పంటకు ఒక ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే తీసుకుంటున్నారు, ఎలాంటి షరతు లేకుండా ఎకరానికి 40 క్వింటాలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.కొనుగోలు కేంద్రాల నిర్వహకులు బస్తాకు మూడు కిలోల చొప్పున కట్టింగ్ అవుతాయని రైతులకు చెప్తున్నారు. ఎలాంటి తరుగు లేకుండా 40 కిలోల ఒక్క గన్ని బ్యాగు వేసి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వడ్లు కాంటా అయిన తరువాత వడ్ల బస్తాలు తరలించడానికి బ్యాగుకు 2 రూపాయల చొప్పున అడుగుతున్నారాని గతంలో రెండు రూపాయలు అనేది ఎప్పుడూ తీసుకోలేదు,ఇది అవినీతికి నిలువెత్తు నిదర్శనం కదాఅని విమర్శించారు.
వడ్లకు ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని కొనడం వలన ఒక క్వింటాలుకు 20 రూపాయల తేడా ఉంది కానీ మొత్తం వడ్లను బి గ్రేడ్ కింద కొంటున్నారు దీనివలన రైతుల నష్టపోతున్నారు కాబట్టి ఏ గ్రేడ్ వడ్లను ఏ గ్రేడ్ కిందనే కొనాలి డిమాండ్ చేశారు.కొనుగోలు నిర్వాహకులు మొక్కజొన్న పంటకు ఎకరానికి 26 క్వింటలు మాత్రమే తీసుకుంటామని అంటున్నారు ఎలాంటి తరుగు లేకున్నా 40 క్వింటల్లు తీసుకోవాలి. ఒకవేళ కొనుగోలు నిర్వాహకులు తీసుకోకపోతే రైతుల దగ్గర నుండి దళారులు తక్కువ రేటుతో పంటను కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వం ప్రకటించినట్టుగా వడ్లకు (దొడ్డు వడ్లు,సన్నం వడ్లు అనే తేడా లేకుండా) క్వింటాల్ కి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. రైతు పండించిన పంటలను కొనవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని అన్నారు. కేంద్రంలో ఎంపీలను బిజెపి పార్టీ కొంటుంది, రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కానీ రైతులు పండించిన పంటను మాత్రం ఎవరు కొనడం లేదు అని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు పండించిన ప్రతి ఒక్క గింజ తీసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అని అన్నారు. అనంతరం దండేపల్లి తహసీల్దార్ రోహిత్ దేశ్పడే కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
