విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ వితరణ…

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ వితరణ…
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం జగన్ యువసేన ఆధ్వర్యంలో ఉప్లూర్ గ్రామానికి చెందిన అవారి సుభాష్ నాయకత్వంలో విద్యార్థులకు 100 పరీక్ష ప్యాడ్స్, 200 పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా ఆవారీ సుభాష్ మాట్లాడుతూ ఈనెల 25 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జగన్ యువసేన ద్వారా పరీక్ష ప్యాడ్స్ ను, పెన్నులను అందజేయడం జరిగింది అని, అదేవిధంగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులై కళాశాలకు, తల్లిదండ్రులకు, కమ్మర్ పల్లి మండలానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలకు 20 డ్యూయల్ డెస్క్ బెంచ్ లు ఇస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు వితరణ చేసినందుకు కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మధు కుమార్, అధ్యాపకులు వైష్ణవి, వెంకటేష్, గంగాధర్, గంగారాం, మహేందర్, శ్రీహరి, మురళీకృష్ణ, ఆనంద్, అనుదీప్ స్వాతి, సుమతి, హర్షిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్ యువసేన నాయకులు రాజకుమార్, దిలీప్, మహేష్, అనిరుద్, అఖిలేష్, చోటు, నితీష్, అజయ్, రాజేష్, సాయి తేజ, అరవింద్, సందీప్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
