Breaking News | పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి పోలీసుల కాల్పులు!

Breaking News | పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి పోలీసుల కాల్పులు!

స్థానిక ఎన్నికల నామినేషన్ల వేళ వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ


Breaking News | పులివెందుల, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పులివెందులలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో నామినేషన్ల కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.