ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం

కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన మండలి వెంకట్రామ్

ఘంటసాల – ఆంధ్రప్రభ: శ్రీకాకుళంలో ఘంటసాల మండలంలో ఉన్న శ్రీ ఏకరాత్రి ప్రసన్నమల్లిఖార్జునస్వామివారి దేవాలయ పునఃనిర్మాణ పనులను సోమవారం ఉదయం ప్రారంభించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. సిజిఎఫ్ అంచనా నిధులు రూ.3 కోట్ల 75 లక్షలతో దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నట్టు వెంకట్రామ్ తెలిపారు.

కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి సహకారంతో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఈ దేవాలయ పునర్నిర్మాణం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నిధులు సమకూర్చినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, జనసేన నాయకులు సుగ్గన పవన్ కుమార్, డిసి వైస్ చైర్మన్ సుగ్గన రాంబాబు, జనసేన నాయకులు కొండవీటి కృష్ణమూర్తి, కొండవీటి శ్రీనివాసరావు, కూటమి నేతలు దాసం రామకృష్ణ, తమ్మన సోమేశ్వరరావు, సుగ్గన రాంబాబు, గోపు రాఘవరాజు, శ్రీను, సత్యం, నాగేశ్వరరావు, మేకా పాములు, కొండవీటి కోటి, బాబురావు, పువ్వాడ సాంబయ్య, మేకా పుల్లయ్య, ఆలయ ఈవో తోట చెన్నకేశవరావు, భక్తులు పాల్గొన్నారు.