• రాత్రి 9.56 గంటలకు … చంద్రగ్రహణం
  • రాత్రి 1.26 గంటలకు స్వస్తి

శ్రీశైలం, ఆంధ్రప్రభ : చంద్రగ్రహణం సందర్భంగా శ్రీశైలం పుణ్య క్షేత్రం(Srisailam Punya Kshetra)లోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున దేవాలయం ఆలయ ద్వారాలను ఆదివారంమధ్యాహ్నం 1.00 గంటకు మూసివేశారు.

ప్రధాన అర్చకులు శివప్ర సాద స్వామి, పలువురు అర్చకులు, వేద పండితులు, ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి ఎం. హరిదాసు, స్వామి పర్యవేక్షకులు ఎం.రవికుమార్(M. Ravikumar). భ్రమరాంబిక ఆలయ పర్యవేక్షకులు జీ.రవి, ముఖ్య భద్రతాధి(Head of Security)కారి బీ.శ్రీనివాసరావులో ఆధ్వర్యంలో ఆలయ ద్వారాలను మూసివేశారు.

ఈరోజు రాత్రి 9.56 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 1.26 గంటలకు నిమిషాలకు ముగుస్తుంది. ఆలయ వేళల మార్పు కారణంగా ఆదివారం మధ్యాహ్నం వరకు భక్తులందరికీ శ్రీ స్వామి అలంకార దర్శనం మాత్రమే కల్పించినట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

మల్లన్నస్వామి స్పర్శ దర్శ(Mallannaswamy touch screen)నాన్నిపూర్తిగా నిలిపివేసినట్టు వివరించారు. ఆలయంలోని అన్నిఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని నిలిపివేశామన్నారు.

ఆలయ ప్రాంగణంలోని సాక్షి గణపతి హఠ కేశ్వరం, పాలధార, పంచదార, శిఖరేశ్వరం మొదలైన పరివార అలయాల ద్వారాలను కూడా మూసివేసామని తెలిపారు. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ(Temple) ద్వారాలను తెరచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ జరిపిన తర్వాత, శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు జరిపిస్తామని, సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి శ్రీ స్వామి అమ్మ వాళ్లకు మహా మంగళ హారతులను జరిపిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు భక్తులందరికీ శ్రీ స్వామి అలంకరణ దర్శనం కల్పిస్తామన్నారు. గతంలో సెప్టెంబర్ 8వ తేదీ నాటికి ఆన్ లైన్‌(Online)లో స్వామి వారి స్పర్శ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు, విరామ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు స్పర్శ దర్శనం కల్పిస్తామన్నారు.

సాయంకాలం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అఅకార దర్శనాలు కొనసాగిస్తామని కార్యనిర్వాహణాధికారి తెలిపారు. చంద్రగ్రహణం(Chandragrahanam) సందర్భంగా ఆదివారం అన్నపూర్ణ భవనంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నప్రసాధ వితరణ నిర్వహించారు.

Leave a Reply