Temple | సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

Temple | సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
Temple | మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవిలో కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలువురు హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు చీకటి మానవేంద్రరాధ్ రాయ్, వేనుతురుమల్లి గోపాలకృష్ణారావు లకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో న్యాయమూర్తులు పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వారిని దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షం విశిష్టతలను తెలుసుకొని, పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మచిలీపట్నం జిల్లా జడ్జి జి గోపి, ఆరవ అదనపు జిల్లా జడ్జి పాండురంగారెడ్డి, పదవ కోర్టు అదనపు జిల్లా జడ్జి బాబూనాయక్, అవనిగడ్డ సివిల్ జడ్జి – జూనియర్ డివిజన్ వి స్వర్ణలత, అవనిగడ్డ డి.ఎస్.పి తాళ్లూరి విద్య శ్రీ, తాసిల్దార్ ముప్పిరిశెట్టి హరిహరనాథ్, చల్లపల్లి సిఐ కె ఈశ్వరరావు, ఎస్ఐలు పామర్తి గౌతమ్ కుమార్, వేమన చందన తదితరులు పాల్గొన్నారు.

