Temple | హుండీ కానుకలు…
వేణుగోపాల స్వామి ఆదాయం రూ.18,46,236
Temple | గంపలగూడెం, (ఆంధ్రప్రభ): జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో 03/09/2025 నుండి 06/12/2025 వరకు భక్తులు సమర్పించిన హుండీ కానుకలను లెక్కించగా 18,46,236 రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమీషనర్ నేల సంధ్య తెలిపారు.ఆలయంలోని ఆరు హుండీల ఆదాయం రూ.18,20,048 అన్నప్రసాదం హుండీ రూ.26,188 లభించినట్లు వివరించారు.అదేవిధంగా బంగారం 10 గ్రాముల 880 మిల్లీ గ్రాములు,వెండి 1 కేజీల 778 గ్రాములు,26 అమెరికా డాలర్లు, వచ్చినట్లు వెల్లడించారు.లెక్కింపును జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎస్.షణ్ముగం,గన్నవరం డివిజన్ తనిఖీ అధికారిని కె.అనురాధ పర్యవేక్షించారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షురాలు కావూరి శశిరేఖ,సత్యసాయి సేవా సమితి సభ్యులు,గ్రామ ప్రజలు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

