తెలుగు వెలుగు సూర్యుడు సీపీ బ్రౌన్

తెలుగు వెలుగు సూర్యుడు సీపీ బ్రౌన్
జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: తెలుగు భాష ను, తెలుగు సాహిత్యాన్ని వెలిగింపజేసిన సూర్యుడుగా సీపీ బ్రౌన్ ను భావించవచ్చని శ్రీ సత్యసాయి జాయింట్ జిల్లా కలెక్టర్ మౌర్య భరద్వాజ్ (Maurya Bharadwaj) పేర్కొన్నారు.
సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో… ఘనంగా సి.పి. బ్రౌన్ 227వ జయంతి వేడుకల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సి.పి. బ్రౌన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి పుష్పాంజలి ఘటించారు.
జేసీతో పాటు డిఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డిఓ సువర్ణ, డిఆర్డిఏ పిడి, జిల్లా పర్యాటక ఇన్చార్జ్ అధికారి నరసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు సిపి బ్రౌన్ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… తెలుగు భాష, సాహిత్య పరిరక్షణలో సి.పి. బ్రౌన్ (CP Brown) చేసిన కృషి అమూల్యమన్నారు. ఆయన సంపాదించిన నిఘంటువులు, తెలుగు వ్యాకరణ గ్రంథాలు నేటికీ మార్గదర్శకాలని పేర్కొన్నారు. తెలుగు భాషను అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిని స్మరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
