తెలంగాణ మొత్తం అప్పు 4,42,297 కోట్లు..

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పు రూ.4,42,297 కోట్ల రూపాయలకు చేరింది. ఈ విషయాన్ని భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తాజా నివేదికలో ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం రూ.3,93 కోట్ల రూపాయల అప్పు చేయగా 2025 మార్చి నాటికి మరో రూ.50 వేల కోట్ల రూపాయలు పెరిగిందని ఆ నివేదికలో పేర్కొంది.
అప్పుల్లో స్టేట్ డెవలప్‌మెంట్ రుణంగా రూ.3,58 కోట్లు, పవర్ బాండ్లతో రూ.7100 కోట్లు, ఎన్‌ఎస్ ఎస్‌ఎఫ్ నుంచి రూ.3,334 కోట్లు, నాబార్డ్ నుంచి రూ.5,390 కోట్లు, బ్యాంకుల నుంచి రూ.మూడు వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.14,727 కోట్లు, పీఎఫ్ నుంచి రూ.16,700 కోట్లు ఋణం తీసుకుందని ఆర్‌బీఐ తెలిపింది.
