Telangana TET 2026 | తెలంగాణలో రెండో విడత టెట్ కు నోటిపికేషన్ విడుదల
- అక్టోబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు..
- నవంబర్ 16 నుంచి 21 వరకు ఆన్‌లైన్ పరీక్షలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు శుభవార్త. రెండో విడత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండో విడత టెట్ పరీక్షలను నవంబర్ 16 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానం (సీబీటీ)లో జరుగుతాయి. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.
ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ టెట్‌ను నిర్వహిస్తోంది. ఉపాధ్యాయుల సర్వీసు అంశాలు, భవిష్యత్ అవకాశాల్లో టెట్ అర్హత కీలకంగా మారిన నేపథ్యంలో ఈ ప్రత్యేక పరీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది.గతంలో నిర్వహించిన తొలి విడత ప్రత్యేక టెట్‌కు పెద్ద సంఖ్యలో ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు. అర్హత సాధించని వారు, అవకాశం పొందని వారికి రెండో విడత పరీక్ష ద్వారా మరో అవకాశం లభించనుంది.
