Telanganaలో రిజినల్ రింగ్ లైన్ ఏర్పాటు చేయండి – రైల్వే మంత్రికి రేవంత్ వినతి

ఢిల్లీ – తెలంగాణ లో రిజినల్ రింగ్ లైన్ (Regional ring line ) ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (cm revanth reddy ) కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ (Railway minister Ashwini vyashnav ) ను కోరారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రేవంత్ నేడు కేంద్ర‌మంత్రిని క‌లిశారు.. తెలంగాణ‌లోని ప‌లు రైల్వే ప్రాజెక్ట్ ల గురించిన ఆయ‌న‌తో చ‌ర్చించారు.. పెండింగ్ లో ఉన్న ప‌లు ప్రాజెక్ట్ ల‌ను ప్ర‌స్తావిస్తూ వాటిని వేగ‌వంతంగా పూర్తి చేయాల‌ని కోరారు.. ఐటీకి (IT) సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. దీనిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్ప‌దించారు. ఈ స‌మావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి , ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.. కాగా, రేవంత్ నేటి సాయంత్రం హైద‌రాబాద్ కు తిరిగి రానున్నారు..

Leave a Reply