Telangana | జూబ్లీహిల్స్ గెలుపుతో మ‌రింత బలం…

Telangana | జూబ్లీహిల్స్ గెలుపుతో మ‌రింత బలం…

Telangana | ఎండపల్లి ఆంధ్రప్రభ : ఎండపల్లి మండలం కొత్తపేటలో దాన్యం కొనుగోలు సెంటర్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజలు భారీ మెజార్టీ ఇవ్వడం తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అపార నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రజలు అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటు వేస్తారని… అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో గెలుపు సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఇప్పటికైనా గ్రహించుకోవాలని మంత్రి ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం, బాధ్యత పెరిగిందని… పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో ఎడ్ల అనిల్ కుమార్, ఆర్ ఐ అన్వేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలంధర్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ గూడ రాంరెడ్డి, వైస్ చైర్మన్ గోళ్ల తిరుపతి, కాంగ్రెస్ నాయకులు రామ్మోహన్ రావు, పుదారి రమేష్, పోలోజు శ్రీనివాస్ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply