హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (cm revanth reddy ) హైకోర్టులో(high court ) ఊరట (relief ) లభించింది. గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో (goutchibouli ps ) ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును(sc , st case ) హైకోర్టు రద్దు చేసింది. 2016లో హౌసింగ్ సొసైటీ స్థలాన్ని అక్రమించేందుకు ప్రయత్నించారని పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా, రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, మరో వ్యక్తి లక్ష్మయ్యలపై కేసు నమోదైంది. పెద్దిరాజు ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఎస్సీ, ఎస్టీ నిర్బంధ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత నెల 20న ఇరువైపుల వాదనలు పూర్తవగా, న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. న్యాయస్థానం తుది ఉత్తర్వులు నేడు వెలువరించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంఘటనా సమయంలో రేవంత్ రెడ్డి ఘటనాస్థలిలో లేరని దర్యాప్తులో తేలిందని పేర్కొంది. అలాగే, ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది.

