హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కాళేశ్వరం (Kaleshwaram)పై జస్టిస్ చంద్రఘోష్ (Justice Chandraghosh) ఇచ్చిన నివేదిక ఆధారంగా కాళేశ్వరం‌పై విచారణకు సీబీఐ (CBI)కి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో ఆదివారం రాత్రి ప్రకటించిన సంగ‌తి విదిత‌మే. ఈ క్రమంలోనే కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించే విషయంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు చేప‌ట్టింది.

2022లో రాష్ట్రంలోకి సీబీఐ రాకపై అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఉపసంహరించుకునేందుకు రేవంత్ సర్కార్ పూనుకుంది. అసెంబ్లీలో కాళేశ్వరం (Kaleshwaram) పై చేసిన తీర్మానం కాపీతో పాటు, విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు, జస్టిస్ చంద్రఘోష్ రిపోర్టులను జతచేసి సీఎస్ రామకృష్ణ రావు (CS Ramakrishna Rao) ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖను రాసేందుకు స‌ర్కార్‌ సిద్ధమైనట్లుగా సమాచారం.

Leave a Reply