వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం
ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి
కరీమాబాద్, ఆంధ్రప్రభ: వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయం సాధిస్తారని తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. ఆదివారం 33వ డివిజన్లోని రాజశ్రీ గార్డెన్లో పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ అవగాహన సదస్సును నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారని అన్నారు.
రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. మీ అందరీ ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్ పతన కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టకుండా ప్రజా వ్యతిరేకతను తొక్కి పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలను నిర్వహించే ధైర్యం లేదు.. కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థనలను ప్రకటించిన పోటీ చేయడానికి అభ్యర్థులు సుముఖంగా లేరు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాకూడా పోటీ చేయడానికి అభ్యర్థులు లేకుండా పోతున్న పరిస్థితి అని రాకేష్ రెడ్డి అన్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా వ్యత్యాసం ఉంటుంది.
విద్యావంతులైన వారు ఎన్నుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది…
రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తే కచ్చితంగా ప్రజల చూపు బీఆర్ఎస్ వైపు ఉంటుందన్నారు. ప్రజలందరూ కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలిస్తే కాంగ్రెస్కు కచ్చితమైన గెలుపు రాలేదు. మూడు రోజులు లెక్కించిన స్పష్టమైన ఆదిక్యం లేదని చెప్పారు. పట్టభద్రులందరూ సంఘటితంగా కృషి చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ బాబు, రెడ్డి కుమారస్వామి, బయ్య స్వామి, కుందారపు రాజేందర్, నీలం రాజశేఖర్, ప్రవీణ్, తదితర నాయకులు పాల్గొన్నారు.
