పెంచిన పింఛన్ల దరఖాస్తుల గడువు

సెప్టెంబర్‌ 15 వరకు అవకాశం..
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి: ఎంపీడీవో

జైనూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును సెప్టెంబర్‌ 15 వరకు పొడిగించిందని కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండల అభివృద్ధి అధికారి కృష్ణవేణి తెలిపారు. తొలుత పింఛన్ల దరఖాస్తు గడువు 31వ తేదీ వరకు ఉండగా, అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం గడువును పొడిగించిందని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోని వారు తమ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు అందజేయాలని ఎంపీడీవో కోరారు.

పెంచిన గడువు విషయాన్ని అర్హులైన ప్రజలకు తెలియజేసి, వారు దరఖాస్తు చేసుకునేలా గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు తగిన శ్రద్ధ చూపాలని సూచించారు. మంగళవారం భూసిమెట్ట గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో కృష్ణవేణి సర్పంచ్‌ ఆత్రం సింధు నగేష్‌, గ్రామస్తులతో మాట్లాడారు. పెంచిన గడువు వల్ల గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆమె తెలిపారు.