ఉద్యమకారుడి అరెస్టు, బైండోవర్‌పై బీఆర్‌ఎస్‌ నేతల ఖండన

పత్తి గోపాల్‌రెడ్డిపై చర్యలు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌

తాడ్వాయి, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ములుగు జిల్లా నాయకుడు పత్తి గోపాల్‌రెడ్డిని అరెస్టు చేయడంతో పాటు బైండోవర్‌ చేయడాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమకారుల పట్ల ఇలాంటి చర్యలు చేపట్టడం బాధాకరమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, ఉద్యమకారుల గొంతును అణచివేసే విధంగా వ్యవహరించడం సరికాదని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. పత్తి గోపాల్‌రెడ్డిపై తీసుకున్న బైండోవర్‌ చర్యలను వెంటనే ఎత్తివేయాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.