Telangana | ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు

Telangana | ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పెళ్లి వాహనం బోల్తా పడి ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కొండాపూర్ లో చోటుచేసుకుంది. గ్రామ శివారులో జాతీయ రహదారిపై టైరు పేలి డీసీఎం వ్యాన్ బోల్తా పడటంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోన్ పల్లి గ్రామానికి చెందిన కొంతమంది ఆర్మూర్‌లో జరిగే పెళ్లికి హాజరయ్యేందుకు ఇవాళ ఉదయం ఐచర్ వాహనంలో బయలుదేరారు. వాహనం కొండాపూర్ గ్రామ సమీపానికి చేరుకోగానే ముందు టైరు ఒక్కసారిగా పేలడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్నవారికి గాయాలు కావడంతో వారిని చికిత్సల కోసం నిర్మల్‌లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు. మృతుల‌ను బ‌ర‌డే ల‌క్ష్మ‌ణ్ (45), తుల‌సీదాస్ (38)గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

Leave a Reply