Telangana | 15న శివరాత్రి జాగరణ

Telangana | 15న శివరాత్రి జాగరణ

Telangana | ర‌హీంపుర, ఆంధ్ర‌ప్ర‌భ : ఈ నెల 15 రాత్రి రహీంపురా సత్తెన్నగల్లీలోగల చారిత్రక శ్రీ శంకర్ జి హనుమాన్ జి, అయ్యప్ప స్వామి దేవాలయ కల్యాణ మండపంలో శ్రీ శివ మహా జాగరణ మహోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు చైర్మన్ గోడిశాల నరేష్ గౌడ్, అధ్యక్షుడు బి.రాజ్ కుమార్ ముదిరాజ్, ప్రధానకార్యదర్శి. కె.మోహన్ గౌడ్, కోశాధికారి ఎం. పురుషోత్తం సింగ్, ఆర్గనైసింగ్ సెక్రటరీ ఎస్. రామ్ నాథ్, కన్వీనర్ ఓంకారి ధనరాజ్ సలహాదారులు ఆనంద్ సింగ్ లోధలు తెలిపారు. ఈ మేరకు ఈ రోజు దేవాలయంలో శ్రీ మహా శివరాత్రి జాగరణ మహోత్సవం బ్రోచర్ విడుదలచేసారు.

ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ… అయ్యప్ప కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి భాగ్యనగర్ శ్రీ మాశక్తి యువ‌ మండల్ ద్వార జాగరణ భజనలు, ప్రముఖ్ భజన గాయకులు టీ.రవి సింగ్, మనోజ్ శర్మ, ప్రవీణ్ లు ఆలపిస్తారు. అలాగే మధురకు చెందిన కృష్ణ బ్రిజ్ వాసి గ్రూప్ వారిచే వివిధ దేవతల వేశాధారణ, సాంకృతిక కార్యక్రమం భక్తులను అల‌రిస్తాయిన్నారు. 16వ తేదీన ఉదయం 9.30 గంటలకు అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బి. గోవింద్ రావు, కె. రాజు గుప్తా, బాలకిషన్ చవాన్, నాగి రెడ్డి, దీపక్ సింగ్, పి. శ్రీధర్, జీవన్ ప్రసాద్, శ్యామ్ రావు, విశ్వనాధ్ ఆనంద్, అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply