ఘనంగా గిరిజనుల తీజ్‌ ఉత్సవాలు

ఒంటిప్పతండా, అందుకుతండాలో వేడుకలు..
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలంలోని ఒంటిప్పతండా, అందుకుతండాలో గిరిజనులు నిర్వహిస్తున్న తీజ్‌ ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని గిరిజనులతో కలిసి ఉత్సవాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీజ్‌ పండుగ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. గిరిజనుల సాంప్రదాయ పండుగలు, ఆచారాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, వాటిని భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

తీజ్‌ వేడుకల్లో మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ పాటలు పాడుతూ, నృత్యాలతో సందడి చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్‌, మాజీ ఎంపీటీసీ కుర మైపాల్‌రెడ్డి, గిరిజన పెద్దలు, కులస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.