సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి శివ నాగరాజు
పాలకోడేరు, ఆంధ్రప్రభ: ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు సహకారంతో పాలకోడేరు మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ పాలకోడేరు మండల జడ్పీటీసీ అభ్యర్థి చింతలపాటి శివ నాగరాజు అన్నారు. పాలకోడేరు, మోగల్లు, కుముదవల్లి, శృంగవృక్షం గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల కూటమి ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.
తమ విలువైన ఓటును కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు వేసి అద్భుత మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మోగల్లు బాబు, ఇందుకూరి బలరామరాజు, కలిదిండి కృష్ణంరాజు, మాజీ సర్పంచ్ భూపతి రాజు వంశీకృష్ణంరాజు, మాధవరాజు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
