ఇంటింటికీ టీడీపీ సంక్షేమ పథకాల ప్రచారం

ప్రజలకు పథకాలు, అభివృద్ధి పనుల వివరాలు తెలిపిన డివిజన్‌ అధ్యక్షుడు, ఇన్‌చార్జి

పాయకాపురం, ఆంధ్రప్రభ : సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమా పిలుపు మేరకు ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించారు. స్థానిక 62వ డివిజన్‌లో డివిజన్‌ ఇన్‌చార్జి పైడి శ్రీను, అధ్యక్షుడు జలకం రాజారావు టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమా హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, ప్రధాన కార్యదర్శి మరియ బాబు, గోపిరెడ్డి, జూలూరు సాయి తదితరులు పాల్గొన్నారు.