ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు టీడీపీ నాయకుల శుభాకాంక్షలు
భవానిపురం, ఆంధ్రప్రభ: ఇటీవల శాసనమండలి సభ్యునిగా (ఎమ్మెల్సీ) గా ఎన్నికైన వర్ల రామయ్యకు టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం విద్యాధరపురంలోని వర్ల రామయ్య నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి నూతన పదవీ బాధ్యతలు విజయవంతం కావాలని కోరారు. ఎమ్మెల్సీ వర్ల రామయ్య ప్రజా సేవలో మరిన్ని విజయాలు అందుకోవాలని వారు ఆకాంక్షించారు.
