Target 2029 Ap : స్పీడ్ పెంచండి Andhra Prabha Latest News

Target 2029 Ap : స్పీడ్ పెంచండి Andhra Prabha Latest News

  • 2029 నాటికి 50 వేల హోటల్ గదుల లక్ష్యం
  • 10 వేల హోమ్ స్టేలు
  • విశాఖ, తిరుపతిలో అమ్యూజ్మెంట్ పార్కుల ప్రణాళిక
  • కారావాన్ టూరిజం అభివృద్ధిపై కీలక సూచనలు
  • ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం
  • ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద ప్రాజెక్టులు
  • గండికోట, అరకు, బొర్రా గుహలు టూరిజం హబ్‌లుగా
  • గోదావరి పుష్కరఘాట్, హావ్‌లాక్ బ్రిడ్జ్ అభివృద్ధి పనులు
  • ఏపీ పర్యాటక రంగంపై సీఎం చంద్రబాబు సమీక్ష

( ఆంధ్ర‌ప్ర‌భ‌, ఏపీ న్యూస్ నెట్ వ‌ర్క్ )

Target 2029 Ap

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో అమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వెల‌గపూడిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధ‌వారం సమీక్ష జ‌రిపారు. ఈ స‌మీక్ష‌లో మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

Target 2029 Ap

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు నాముడు మాట్లాడుతూ, 2029 నాటికి 50 వేల హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పర్యాటకులకు 10 వేల హోం స్టేలను కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని స్పష్టం సీఎం చేశారు. విశాఖ, తిరుపతిలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. కారావాన్ల రిజిస్ట్రేషన్లు, కారావాన్ పార్కుల ఏర్పాటు అంశంపైనా సీఎం కీల‌క సూచనలు చేశారు.

Target 2029 Ap : ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం

Target 2029 Ap

అటవీ, దేవాదాయశాఖల సమన్వయంతో ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని స్పష్టం చేశారు.

Target 2029 Ap

ప్రశాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద వివిధ దేవాలయాలు, దర్శనీయ స్థలాల అభివృద్ధి ప్రాజెక్టులు 2026 మే నాటికి సిద్ధం చేయాలన్నారు. ఈ రెండు పథకాల కింద మరో రూ.663 కోట్లకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు పర్యాటకశాఖ అధికారులు వివ‌రించారు. గండికోట, సూర్యలంక, అరకు బొర్రా గుహలు తదితర ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరఘాట్‌తో పాటు హావ్ లాక్ బ్రిడ్జిపై పర్యాటకులను అనుమతించే పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని సీఎం సూచించారు.

ALSO READ : Minister Poetic Tag : పరాభవం కాదు Andhra Prabha News

Leave a Reply