Bigg Boss 9 | దట్ ఈజ్ తనూజ!

Bigg Boss 9 | దట్ ఈజ్ తనూజ!
సెకండ్ ఫైనలిస్ట్ కు అర్హత సాధించింది.. కానీ
బిగ్ బాస్ ఆఫర్‌కు నో.. ఫైనలిస్ట్ చాన్స్ మిస్
ప్రేక్షకుల నిర్ణయం మేరకే అని స్పష్టీకరణ
Bigg Boss 9 | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బిగ్‌బాస్ సీజన్-9 (Bigg Boss 9) గ్రాండ్ ఫినాలే మరో వారం రోజుల్లో జరగనుంది. ఈ వారం సెకండ్ ఫైనలిస్టు టాస్క్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కళ్యాణ్ పడాల నిలిచాడు. ఇక మిగిలిన నాలుగు స్థానాల కోసం ఆరుగురు పోటీపడుతున్నారు. తనూజ (Tanuja), పవన్, ఇమ్మాన్యుయేల్, పవన్, భరణి, సంజనా, సుమన్ శెట్టి పోటీలో ఉన్నారు. టాస్క్‌ల నుంచి ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ నిన్న తనూజ, ఇమ్మాన్యుయేల్ పోటీ పడ్డారు. చివరకు అధిక పాయింట్లు సాధించి తనూజ విజేతగా నిలిచింది.
Bigg Boss 9 | సెకండ్ ఫైనలిస్ట్ కు అర్హత సాధించింది.. కానీ
ఈ టాస్కులో గెలిచి తనూజ సెకండ్ ఫైనలిస్ట్ రేసు (Second finalist race) లో టాప్-1లో నిలిచింది. లీడర్ బోర్డులో టాప్‌లో ఉండటంతో తనూజకి బిగ్‌బాస్ చెప్పిన ప్రకారం ఈ వారం ఇమ్యూనిటీ దక్కి సెకండ్ ఫైనలిస్ట్ కాబోతుంది అందరూ ఊహించారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు తనూజకు. దీనికి తనూజ కూడా తనదైన శైలిలో నో చెప్పింది!
బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి తనూజతో బిగ్‌బాస్ మాట్లాడారు.

Bigg Boss 9 | బిగ్ బాస్ ఆఫర్‌కు నో చెప్పిన తనూజ
విజేతగా నిలిచిన తనూజ (Tanuja) 750 పాయింట్లు, మూడు లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ప్రకారం మూడు లక్షలు విడిచిపెడితే సెకండ్ ఫైనల్ లిస్టుకు చేరుకోవచ్చునని, ప్రైజ్ మనీలో ఆ మొత్తం తగ్గిస్తామని బిగ్ బాస్ చెప్పాడు. ఈ ఆఫర్ కాదంటే నామినేషన్ ఎదుర్కొవలసి ఉంటుందని బిగ్‌బాస్ తెలిపాడు. అందుకు నో చెప్పింది తనూజ.

Bigg Boss 9 | ప్రేక్షకుల నిర్ణయమేరకే ఫైనల్ లిస్టుకు వెళ్తా… తనూజ
నాకు ప్రైజ్ మనీ ముఖ్యం కాదని.. ప్రేక్షకుల నిర్ణయం మేరకే ఫైనల్ లిస్టుకు వెళతానని తనూజ స్పష్టం చేసింది. ఆర్యూ సూర్ అంటూ బిగ్ బాస్ అడిగాడు. అందుకు ఓకే చెప్పింది. నామినేషన్ ఎదుర్కొంటానని చెప్పింది తనూజ.
