Tandoor : సత్యమే విజయానకి మూలం…
తిర్యాణి, ఆంధ్రప్రభ : విద్యార్థినుల్లో దేశభక్తి, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే లక్ష్యంతో సత్యమేవ జయతే ఫౌండేషన్(Satyameva Jayate Foundation), తెలంగాణ సైనిక్ యూత్ మోటివేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు తాండూర్(Tandoor) మండలంలోని ప్రభుత్వ గురుకులం, కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఫౌండేషన్ కొమరం భీమ్ జిల్లా ఇన్‌ఛార్జ్ మూలమట్టం శివ, మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆశం అశోక్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సత్యమే విజయానికి మూలమని, విద్యార్థులు(students) నిజాయితీ, కృషి మార్గంలో నడిస్తేనే భారత భవిష్యత్తు బలపడుతుందని, పుస్తకాలకతీతంగా ఆలోచించే విద్యార్థినులే దేశ భవిష్యత్తు సృష్టిస్తారన్నారు.
విద్య కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదని, ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో(students) వ్యక్తిత్వ వికాసానికి, సమాజానికి మార్గదర్శకులుగా ఎదగడానికి దోహదం చేస్తాయన్నారు. సేవాస్ఫూర్తి, దేశభక్తి పెంపొందించడమే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మప్రచారకుడు వేణుగోపాల్‌రావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


