Thanda | ఉంగరం గుర్తుకు ఓటేసి.. అభివృద్ధిని స్వాగతించండి
Thanda | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఉంగరం గుర్తుకు ఓటేసి అభివృద్ధిని స్వాగతించాలని బేగంపేట్ తండా సర్పంచ్ అభ్యర్థి కళ్యాణి మహేష్ గౌడ్ గ్రామస్తులను కోరుతూ… ఆంధ్రప్రభ బ్రోచర్ ను ఈ రోజు గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ.. 10 ఏళ్లలో అభివృద్ధి పనులు కుంటు పడ్డాయని, గ్రామంలో భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే అవినీతి అన్యాయాలను వెలికి తీసి సాధారణ ప్రజలకు న్యాయం చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

