కడెం మండల టెన్త్ టాపర్స్‌కు ప్రతిభా పురస్కారాలు

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో అత్యధిక జీపీఏ సాధించిన ప్రతి పాఠశాల నుండి ఒక్కో విద్యార్థికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని జడ్పీహెచ్ఎస్ లింగాపూర్‌లో పనిచేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వాల్గోట్ కిషన్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు కెరీర్ గైడెన్స్ పుస్తకాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఖానాపూర్‌కు చెందిన వేదం బొజ్జు పటేల్ చేతుల మీదుగా వారికి సన్మానం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని వాల్గోట్ కిషన్ కోరారు.

Leave a Reply