ఓటర్లు లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రం
915 మంది ఓటర్లు.. ఇప్పటివరకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు
స్వచ్ఛందంగా ఎన్నికల బహిష్కరణకు గ్రామస్తుల నిర్ణయం
పూతలపట్టు, ఆంధ్రప్రభ : పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం ఓటర్లు లేక బోసిపోయింది. గ్రామంలో మొత్తం 915 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు ఒక్క ఓటు కూడా పోలవలేదు. గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా ఎన్నికలను బహిష్కరించడంతో పోలింగ్ కేంద్రం వెలవెలబోతోంది.
