Taipei Open | శ్రీకాంత్‌ శుభారంభం..

చైనీస్‌ తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశాడు. ఈరోజు (బుధవారం) జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21-16, 21-15 తేడాతో భారత్‌కే చెందిన ముత్తుసామి సుబ్రమణ్యన్‌ను వరుస గేముల్లో ఓడించి ప్రి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు.

మరో మ్యాచ్‌లో యువ షట్లర్‌ ఆయుష్‌ శెట్టి 21-17, 21-18 తేడాతో మూడో సీడ్‌ లీ చియా హవ్‌ (తైపీ)పై సంచలన విజయం సాధించాడు. తరుణ్‌ మన్నెపల్లి కూడా 21-17, 19-21, 21-12తో షోగో ఒగవా (జపాన్‌)పై పోరాడి గెలిచాడు.

మహిళల సింగిల్స్‌లో ఆకర్శి కశ్యప్‌, అన్మోల్‌ ఖర్బ్‌, రక్షాల రామ్‌రాజ్‌ నిరాశ పరుచగా.. ఉన్నతి హూదా మాత్రం 21-13, 21-17తో అణుపమ ఉపాద్యాయపై నెగ్గి టోర్నీలో ముందంజ వేసింది.

Leave a Reply