Tahsildar | ఓటు హక్కు వినియోగించుకోవాలి…

Tahsildar | ఓటు హక్కు వినియోగించుకోవాలి…

  • తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్

Tahsildar | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని తహసిల్దార్ మహమ్మద్ షబ్బీర్ అన్నారు. 16వ ఓటరు జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం వేల్పూర్ రోడ్ గల ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తహసిల్దార్ కార్యాలయం అధికారులు ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు ఓటర్ల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన భీంగల్ పలు వీధుల గుండా జాతీయ ఓటర్ దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించి బడా భీంగల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మహమ్మద్ షబ్బీర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు పజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి ఓటు నేడే ఓటరుగా పేరును నమోదు చేసుకుందాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో మనం భాగస్వాములవుదాం ఓటరు అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమైనది ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉన్న పౌరులు తమ ఓటు హక్కును వినియో గించుకోవాలని ప్రజా ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధమని అన్నారు.

Tahsildar

ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును నీతి నిజాయితీ నిబంధనతో ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సిహెచ్. తిరుపతి, ఎలక్షన్ డ్యూటీ అశ్విన్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్,ఆర్ఐ లు సాయగౌడ్, మల్లేష్, స్వాతి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ రెడ్డి, అజ్మత్, జూనియర్ అసిస్టెంట్ లు శివ, పల్లవి, హారిక, శారద, రజిత, అంజయ్య, శ్రీకాంత్ చిన్న సాహెబ్, రికార్డ్ అసిస్టెంట్ రాహుల్, నరేష్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది మల్లేష్, మధు, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply