నల్లగొండ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
చైర్మన్‌గా బైరెడ్డి హేమలత వెంకటరెడ్డి బాధ్యతల స్వీకరణ
నల్గొండ, ఆంధ్రప్రభ: నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్మన్‌గా బైరెడ్డి హేమలత వెంకటరెడ్డి, వైస్ చైర్మన్‌గా శ్రీరాములు గౌడ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.
