గుంటూరులో స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభం

( గుంటూరు బ్యూరో , ఆంధ్రప్రభ) : మహిళ ఆరోగ్యంగా బలపడితే ఆమె కుటుంబం కూడా ఆరోగ్యవంతం అవుతుంది, అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmassani Chandrashekhar) అన్నారు . భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని గుంటూరు వైద్య కళాశాలలో బుధవారం కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశాన్ని 4వ ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ప్రధాన మంత్రి మోడీ (Prime Minister Modi) నాయకత్వం అభినందనీయమని పేర్కొన్నారు. స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2 వరకు గుంటూరు జిల్లాలో వైద్యంపై అవగాహన శిబిరాలు నిర్వహిస్తారు. మహిళలు, బాలికలకు రక్తహీనత, క్షయ, సికిల్ సెల్ అనీమియా, బీపీ, మధుమేహం, క్యాన్సర్ తదితర రుగ్మతలకు పరీక్షలు జరుపుతారు.

గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు, పిల్లలకు టీకాలు, పోషకాహారం పై అవగాహన, ప్రధాన మంత్రి వందన యోజన (Prime Minister Vandana Yojana) లో ప్రత్యేక నమోదు చేపడుతారు. ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి మేనేజింగ్ డైరెక్టర్ గిరీషా తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా 13,000 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే నషీర్ అహ్మద్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కృష్టియానా, డిప్యూటీ మేయర్ షేక్ సజీల హాజరయ్యారు.

Leave a Reply