Swami Vivekananda | ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి?

Swami Vivekananda | ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి?
Swami Vivekananda | ఆంధ్రప్రభ, వెబ్డెడెస్క్ : ప్రతి ఒక్కరికి తన శక్తియుక్తుల మీద తనకున్న దృఢమైన నమ్మకం. తనలోని బలాన్ని తెలుసుకొని బలహీనతలను అధిగమించి లక్ష్యసాధనకు ఉపక్రమించేవారే విజయతీరాలను చేరుతారు. ఆత్మవిశ్వాసం (Self-confidence) ముఖాన్ని తేజోవంతం చేసి, చూపులకి చురుకుదనాన్ని ఇస్తుంది. చిరునవ్వు నిండిన మోముతో నమ్మకం నిండిన హృదయంతో శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు ఓర్పుతో నేర్పుగా పరిష్కరించుకొనే సామర్థ్యం సమకూరుతుంది.
”విశ్వాసమే బలం.. సంకోచం మరణం” అన్న స్వామి వివేకానంద (Swami Vivekanannda) వాణి ఆత్మవిశ్వాసాన్ని వెలిగించే దీపం. ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తిని శక్తిగా మార్చి తెలియని బలాన్ని ఇస్తుంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. కష్టాలకి ఎదురీదగలగడం, ఎదురు దెబ్బల్ని తట్టుకోవడం, ఒత్తిడిని అధిగమించి విజయాన్ని పొందడం ఆత్మవిశ్వాసంతోనే సాధ్యం. ద్రోణుడు కాదు పొమ్మన్నా, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో అతడి ప్రతిమనే గురువుగా మార్చుకొని విలువిద్యలో ప్రావీణ్యతను సాధించిన ఏకలవ్యుడిలోని ఆత్మ విశ్వాసం లోకానికి ఆదర్శం.
Swami Vivekananda | ఈ యుద్ధం నావల్ల కాదంటూ..
కురుక్షేత్ర సంగ్రామం మొదలవబోతున్నప్పుడు కౌరవ వీరుల వంక చూసి అర్జునుడు వైరి పక్షంలోని తన వాళ్ళని చూసి నిలువునా నీరు కారిపోయి, గాండీవాన్ని జారవిడచి, చతికిల పడిపోయి, ”కృష్ణా.. ఈ యుద్ధం నావల్ల కాదంటూ చేతులెత్తేశాడు. కృష్ణ భగవానుడు, అర్జునుడిలో నిరాశ నిస్పృహలను దూరం చేస్తూ ఆత్మవిశ్వాసానికి గీతా బోధనతో ఊపిరి (breath) పోసాడు. అతడికి కర్తవ్యాన్ని బోధించి విజయుణ్ణి చేశాడు.
Swami Vivekananda | అలాగని ఆత్మవిశ్వాసం తక్కువైతే..
తనలోని శక్తిని తాను తెలుసుకోలేని సమయంలో, ఆంజనేయుడిని ప్రశంసలతో ముంచెత్తి ఆత్మ విశ్వాసాన్ని మేల్కొల్పారు వానర జనం. సప్త సముద్రాలని అవలీలగా దాటగలిగే శక్తినిచ్చింది ఆ బలం. ఆత్మవిశ్వాసం ఎక్కువైపోతే అది అహంభావంగా మారే ప్రమాదమూ ఉంది. మితి మీరిన అతి విశ్వాసం వ్యక్తిని గర్విష్టిగా మార్చి పతనం చేస్తుంది. అలాగని ఆత్మవిశ్వాసం తక్కువైతే అది ఆత్మ న్యూనతకి దారి తీస్తుంది. ఆత్మన్యూనత అపరాధ భావానికి, అపరాధ భావన పరనిందకి, పరనింద, పగ ప్రతీకారాలకి దారి తీసి మనిషికి అశాంతిని అయోమయాన్ని సృష్టించే ప్రమాదం ఉంది. నాయకత్వ లక్షణాలలో ఆత్మ విశ్వాసానిది అగ్రస్థానం (the top) ఎవరికైతే తమ మీద తమకి నమ్మకం ఉండదో వారు ఇతరుల విశ్వాసాన్ని కోల్పోతారు.
సర్కస్ తీగ మీద నడిచే వాడికి సాధనతోపాటు తన మీద తనకి నమ్మకం కూడా అవసరమే. ఆత్మ విశ్వాసం కోల్పోయిన వారిని ఇతరులు కూడా నాయకులుగా అంగీకరించరు. వారి ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమమైనా అసమగ్రంగా ముగిసి నిరాశనే మిగు లుస్తుంది. ఆశావా#హ దృక్పథం మనిషికి అత్యవ సరం నిరాశ ఆత్మవిశ్వాసానికి ప్రథమ శత్రువు. శల్య సారధ్యంవల్లనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన కర్ణుడు పరాజయం పాలయ్యాడు.
Swami Vivekananda | నేను మాత్రమే చేయగలను అనుకోవడం..
ఆత్మవిశ్వాసం లోపించిన వాళ్ళు మూఢ విశ్వాసాలని, వక్ర మార్గాలని అన్వే షించి ఆసరాగా మార్చుకుంటారు. తమ వైఫల్యా లను కప్పిపుచ్చుకునేందుకు సాకులు వెతుక్కుంటూ విధి మీదనో, కర్మ మీదనో నిందలు వేస్తూ సంతృప్తి చెందుతూ ఉంటారు. ఈ పనిని నేను చేయగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం అయితే, ఈ పనిని నేను మాత్రమే చేయగలను అనుకోవడం అతి విశ్వాసం. ఒక నది ఉన్నది, అది సముద్రాన్ని చేరాలని తన పయనాన్ని మొదలు పెట్టింది. అలా అలా ప్రవహిస్తూ ఉంటే దానికి దారిలో ఎడారి అడ్డొచ్చింది. అది మండుతున్న ఎండతో చేతులు కలిపి నీటి ఆవిరిగా మారి మేఘమైపోయింది.
గాలిని తోడు తీసుకుని ఆకాశంలో వేగంగా కదులుతూ సాగరాన్ని చేరింది. సాగరాన్ని చూసి వర్షించి దానిలో ఐక్యమై తన లక్ష్యా న్ని చేరుకుంది. కార్యసాధకులైన వారు ప్రతికూల మైన అంశాలను కూడా తమకే అనుకూలంగా మార్చుకుంటూ గమ్యాన్ని (Destination) చేరుకుంటారు. కొద్దిపాటి ప్రశంసలతో సానుకూలమైన ప్రియ వచనాలతో, ప్రోత్సా#హంతో ఇతరులలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ద గలగడం సమాజానికి మేలు చేస్తుంది.
-గరిమెళ్ళ నాగేశ్వరరావు
