31వ డివిజన్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిగా సురేశ్
న్యూ శాయంపేట,హన్మకొండ \ఆంధ్ర ప్రభ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 31వ డివిజన్ ఇన్చార్జిగా నియమించినందుకు డీసీసీ నాయకులు మామిండ్ల సురేష్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, బట్టి శీను , తాజా మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు , డివిజన్ ఇన్చార్జి మార్క విజయ్, డివిజన్ అధ్యక్షుడు సత్తు రమేష్, కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీ బలోపేతానికి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
