బాధిత కుటుంబానికి అండగా…

చిట్యాల, ఆంధ్రప్రభ ; చిట్యాల మున్సిపాలిటీ పదో 10వార్డుకు చెందిన దాసరి పద్మ క్యాన్సర్ తో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ పందిరి గీత వారి నివాసానికి వెళ్లి ఆ కుటుంబానికి అండగా నిలిచి, అంత్యక్రియలకు రూ. 5వేలు ఆర్థిక సహాయాన్ని అందించి, పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

Leave a Reply