పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు అండ

నడిగూడెం, ఆంధ్రప్రభ: గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి నిరుద్యోగ యువకులు పోలీస్ నియామకాలకు సిద్ధమవుతుండగా, స్థానిక హైస్కూల్ మైదానంలో పిచ్చి చెట్లు మొలిచి, రాళ్లు తేలి, గుంటలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది.

రన్నింగ్, లాంగ్ జంప్ చేసేటప్పుడు దెబ్బలు తగిలి కాళ్లు, చేతులు విరిగే ప్రమాదం ఉందని యువకులు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని యువకులు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె వెంటనే డోజర్ సహాయంతో మైదానాన్ని శుభ్రం చేయించి, యువకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యను పరిష్కరించారు.తమ విజ్ఞప్తికి స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించిన చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్ కు, మార్నింగ్ వాకర్స్ మరియు యువకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాలకు సిద్ధమవుతున్న యువతీ యువకులు పట్టుదలతో ఉద్యొగాలు సాధించి, ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులకు, గ్రామానికి, చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చదువుకునే నిరుపేద విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు పల్లపు నాగేశ్వరరావు, ఎండి సమద్, మేకపోతుల దినేష్, మేకల సాయి, వీరబాబు, రిటైర్డ్ ఉద్యోగులు మండవ వెంకటేశ్వర్లు, రణబోతు అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.