ఆదరించి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..

- గుడిగండ్ల సర్పంచ్ అభ్యర్థి పెద్ద నర్సిములు
- ముమ్మరంగా ఇంటింటి ప్రచారం
మక్తల్, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల్లో ఆదరించి సర్పంచ్ గా అవకాశం కల్పించండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి పెద్ద నర్సిములు అన్నారు.
ఆదివారం గ్రామంలో తన మద్దతు దారులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లతో కలుసుకొని ఈ ఎన్నికల్లో తనను సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. ఎక్కడికి వెళ్లినా సర్పంచ్ అభ్యర్థి పెద్ద నరసింహులకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
అండగా ఉంటామంటూ ఓటర్లు భరోసా ఇస్తున్నారు. గెలుపు కోసం చేపట్టిన విస్తృత ప్రచారంలో ప్రజల నుండి మద్దతు లభించడం జరిగింది. గ్రామ అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేసే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలవడం జరిగిందని పదవి కోసం కాదని ఆయన ఓటర్లకు వివరించారు.
గ్రామ అభివృద్ధి కోసం ప్రజా సేవకుడిగా ఐదేళ్లపాటు పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ ఎన్నికల్లో ఆదరించి తనను సర్పంచ్ గా గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీతో ఏమీ కాదని ప్రజలు కూడా గుర్తించారన్నారు.
ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజల అండతో ఈ ఎన్నికల్లో తన గెలుపును ఎవరు అడ్డుకోలేరని అన్నారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
అభివృద్ధికి నోచుకోలేని గుడిగండ్ల సర్పంచ్ గా ఆదరిస్తే గ్రామ సర్వతోముగా అభివృద్ధికి కృషి చేస్తానని అభ్యర్థి పెద్ద నర్సిములు అన్నారు. గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను విజ్ఞప్తిచేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి లక్ష్మీ నర్సిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి,నాయకులు మేకల హన్మంతు ,కురువ తిమ్మయ్య, కురువ ఎర్రప్ప, హనుమయ్య గౌడ్, టప్ప హనుమంతు ,మోహన్ రెడ్డి, వడ్ల నర్సిములు తదితరులు పాల్గొన్నారు.
