మేడారంలో సండే సందడి
తాడ్వాయి, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. చత్తీస్గడ్జా, జార్ఖండ్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
ముందుగా జంపన్నవాగులో స్థానాలు ఆచరించి, తలనీలాలతో గద్దెల వద్దకు చేరుకుని తల్లులకు పసుపు కుంకుమ పూలు పండ్లు నూతన వస్త్రాలు బెల్లం కొబ్బరికాయలు ఓడి బియ్యం పుట్టు వెంట్రుకలు కానుకలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర పరిసర ప్రాంతాలైన మ్యూజియం చిలకలగట్టు సారలమ్మ గుడి తదితర ప్రాంతాలను కలియాతిరిగి ఉల్లాసంగా గడిపారు. మేకలను కోళ్లను తల్లులకు నైవేద్యంగా సమర్పించి వంటలు చేసుకొని కుటుంబ సమేతంగా తిని తిరిగి వెళ్లారు. ఈ సందర్బంగా పూజారి కాక అమృత భక్తులకు సేవలు అందించారు.
