సన్ డే ..ఆన్ సైకిల్ ..
బందరు పోలీసుల్లో హుషార్

( ఆంధ్రప్రభ, మచిలీపట్నం ప్రతినిధి) : కృష్ణాజిల్లా (Krishna District) పోలీసులు బందరులో సన్ డే ఆన్ సైకిల్ (Sunday on Cycle) సందడి చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు (District SP R. Gangadhara Rao) ప్రారంభించారు. ఎస్పీ సైతం సైకిల్ పై హ్యాయిగా.. జాలీగా ..జోరుగా బందరు రోడ్డులో సందడి చేశారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల (Central and State Govts.) ఉత్తర్వుల మేరకు ఫిట్ ఇండియా (Fit India) లో భాగంగా, కృష్ణా జిల్లా పోలీస్ శాఖ (Police Department) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సన్ డే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు, పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ , బందరు డీఎస్పీ సీహెచ్ రాజా , బందరు ఇన్ స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు. ఇతర పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో సైక్లింగ్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం (District Police Office) నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ మీదుగా, హౌసింగ్ బోర్డు కాలనీ, త్రీ పిల్లర్స్ సెంటర్, కోనేరు సెంటర్, రేవతి సెంటర్, బస్టాండ్ సెంటర్, లక్ష్మీ టాకీస్ సెంటర్ మీదుగా తిరిగి జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఈ సైక్లింగ్ బృందం చేరింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది ఎప్పుడూ ప్రజల భద్రత కోసం కష్టపడుతూ 24 గంటలు విధుల్లో ఉంటారని, వారిలో శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం చాలా అవసరమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు సన్ డేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. సైక్లింగ్ తో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, మానసిక ఒత్తిడి తగ్గుతుందని, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించగలరన్నారు.

Leave a Reply