రాజకీయ ఉనికి కోసమే మంత్రిపై సుమన్ అసత్య ఆరోపణలు…
బాల్క వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు
చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి వివేక్ వెంకటస్వామిపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సాగుతున్న సంక్షేమం, అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బాల్క సుమన్ అక్కసు వెళ్లగక్కుతున్నారని కాంగ్రెస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుమన్ భవిష్యత్తులో చెన్నూరులో మళ్లీ గెలిచే అవకాశం లేదన్న నిరాశ, రాజకీయ ఉనికి కోసమే మంత్రిపై అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని వారు పేర్కొన్నారు.గత బీఆర్ఎస్ పాలనలో గోదావరి తీరంలో విచ్చలవిడిగా ఇసుక మాఫియా, కమీషన్ల దందా నడిపించి రూ.కోట్లు కొల్లగొట్టింది బాల్క సుమన్ కాదా అని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా ప్రశ్నించారు ప్రశ్నించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మరోసారి మాట్లాడితే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, నిరాధారమైన ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకుని చెన్నూరు ప్రజలకు బాల్క సుమన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
