వరి నాట్లు వేసిన విద్యార్థులు

కడెం హైస్కూల్‌ విద్యార్థుల క్షేత్ర పర్యటన

కడెం, ఆంధ్రప్రభ: కడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం మండలంలోని పెద్దూర్‌ గ్రామంలో వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పొలం యజమాని బోర్లకుంట రాజేష్‌ విద్యార్థులకు వరి సాగు విధానం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను వివరించారు. అనంతరం విద్యార్థులు స్వయంగా పొలంలో వరి నాట్లు వేశారు. వ్యవసాయ పనులను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతోపాటు స్వయంగా నాట్లు వేసిన అనుభవాన్ని విద్యార్థులు ఎంతో ఆస్వాదించారు. పాఠ్యాంశాలతో పాటు క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ వృత్తి విద్య శిక్షకురాలు జోషి రమ్య, ఉపాధ్యాయులు మునేశ్వర్‌, మధుకర్‌, సుజాత, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.