విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు ఉపయోగించాలి
పాణ్యం, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్ విద్య కోసం కళాశాలలో జరిగినటువంటి విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆర్జీయo విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్. ఎం శాంతి రాముడు పేర్కొన్నారు. బుధవారం నెరవాడ సమీపంలోని శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి నూతనంగా ప్రవేశం పొందిన ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థులు , వారి తల్లిదండ్రుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమం కళాశాల సెమినార్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.
నూతన విద్యార్థులను కళాశాల కుటుంబంలోకి ఆహ్వానించడం, వారికి కళాశాల విద్యా విధానం, వాతావరణం, నియమ నిబంధనలు, సదుపాయాలు మరియు భవిష్యత్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ ఇంజినీరింగ్ విద్యను కేవలం డిగ్రీ సాధించే లక్ష్యంతో కాకుండా, జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు మరియు బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం నూతన విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యలో అకడమిక్ క్రమశిక్షణ, హాజరు, సమయపాలన మరియు నిరంతర అభ్యాసం ఎంతో ముఖ్యమని వివరించారు. విద్యార్థులు తరగతి గది బోధనతో పాటు ప్రయోగాత్మక జ్ఞానం, ప్రాజెక్టులు, పరిశోధన, సాంకేతిక కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు మరియు వివిధ క్లబ్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి, స్పష్టమైన కెరీర్ లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం గారు, అన్ని విభాగాల హెచ్ ఓ డి లు, బేసిక్ సైన్స్ విభాగం అధిపతి డా. బి. శేషయ్య లు పాల్గొన్నారు.
