విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి!
- బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ హైమావతి
- మధ్యాహ్న భోజన మెనూ, నాణ్యతపై ఆరా
- పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశం
బెజ్జంకి, నవంబర్ 3 (ఆంధ్రప్రభ): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ హైమావతి మంగళవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
