students | ఫలితాలే లక్ష్యంగా ప్రణాళికలు అమలు…

students | ఫలితాలే లక్ష్యంగా ప్రణాళికలు అమలు…

students | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : రాచపూర్ మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలను ఈ రోజు ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి సేరు శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

రాబోయే పరీక్షల్లో 100% ఉత్తీర్ణతతో పాటు మంచి మార్కులు సాధించాలని ఆర్ సి ఓ అన్నారు. వంద శాతం ఫలితాలు లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేయాలి అని ఆర్ సి ఓ సూచనలు చేశారు. ప్రతిరోజు స్టడీ హవర్స్ నీ చక్కగా ఉపయోగించుకోవాలనీ డైలీ పరీక్షలు రాయడం వల్ల పరీక్షల భయం తొలగిపోతుందని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రిన్సిపల్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

Leave a Reply