శెట్టూరులో సంచలనం
(అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ): కాలం మారిపోయింది. బడిలో బెత్తంతో టీచర్లు కొడితే… అరచెయ్యి పట్టుకుని పిల్లగాళ్లు కన్నీళ్లు పెట్టే రోజులు పోయాయి. ఇప్పుడు దండించే మాస్టార్లపై తిరగబడి పటపట పళ్లు కొరుకుతూ ఎగబడి చెంపలు వాయించే స్టూడెంట్స్(Students) ఉన్న కలికాలమిది.
సభ్యసమాజం సిగ్గుపడే ఈ సంఘటన అనంతపురం(Anantapur) జిల్లా శెట్టూరు(Shettur) మండలంలో జరిగింది. ఒక విద్యార్థి ప్రిన్సిపాల్(Principal) ను కొట్టాడు. ఈ కథ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. శెట్టూరు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీరాములు(sriramulu) పదో తరగతి విద్యార్ధిని దండించగా, ఆ విద్యార్థి హర్ట్(Hurt the student) అయ్యాడు, తిరుగుబాటు చేశాడు. ఏకంగా ప్రిన్పిపాల్ నే చెంప పగలకొట్టాడు.
ఈ విషయం బయటకు పొక్కటంతో డిప్యూటీ డీఈవో రంగంలోకి దిగి మోడల్ స్కూల్ పాఠశాల(Model School is a school)లో విచారణ చేపట్టారు. ఇంతకీ విద్యార్థిని దండించిన ప్రిన్సిపాల్ కు శిక్షపడుతుందా? చెంప పగల కొట్టిన ప్రబుద్ధుడిని స్కూలు నుంచి పంపించేస్తారా? అనేది సోషల్ మీడియా(Social media)లో నడుస్తున్న చర్చ.